స్తుతి పాడుటకే
Christian Song Lyrics
Teluguస్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన – తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే||
ప్రాణభయమును తొలగించినావు – ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే||