స్తుతియింతుము
Christian Song Lyrics
Teluguస్తుతియింతుము స్తోత్రింతుము
పావనుడగు మా పరమ తండ్రిని (2) ||స్తుతియింతుము||
నీ నామము రుజువాయే
నీ ప్రజలలో దేవా (2)
వర్ణింప మా తరమా
మహిమ కలిగిన నీ నామమును ||స్తుతియింతుము||
మా ప్రభువా మా కొరకై
సిలువలో సమసితివి (2)
మాదు రక్షణ కొరకై
రక్తమును కార్చిన రక్షకుడా ||స్తుతియింతుము||