సరి రారెవ్వరు
Christian Song Lyrics
Teluguసరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2)
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి||
నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2)
నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2)
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి||
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)
ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2)
నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి||