స్తోత్రించెదము
Christian Song Lyrics
Teluguస్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2)
యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)
భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు||
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2) ||యేసు||