సోలిపోవలదు మనస్సా
Christian Song Lyrics
Teluguసోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు||
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను
చుట్టుముట్టినా (2)
ప్రియుడు నిన్ను చేరదీసిన
ఆనందం కాదా (2) ||సోలిపోవలదు||
శోధనలను జయించినచో
భాగ్యవంతుడవు (2)
జీవ కిరీటం మోయువేళ
ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు||