సువార్తే పరిష్కారం
Christian Song Lyrics
Teluguఅపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా
ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా