సీయోనులో స్థిరమైన
Christian Song Lyrics
Teluguనీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో||