స్తుతించి పాడెదం
Christian Song Lyrics
Teluguస్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||
గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు
వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు
మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||