నా ఆశల పల్లకి
Christian Song Lyrics
Teluguనా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా (2)
ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2)
నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని (2)
దాహము తీర్చావని ||యేసయ్యా||