నన్ను గన్నయ్య రావె
Christian Song Lyrics
Teluguనన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||