నీ రూపం నాలోన
Christian Song Lyrics
Teluguనీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ (2)
రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా (2)
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ (2)
నీ రూపము నాలో ముద్రించనీ (2) ||నీ రూపం||
నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే (2)
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా (2)
ఆశీర్వాదము నీవే రాజా (2) ||నీ రూపం||