నూతన సంవత్సరం
Christian Song Lyrics
Teluguనూతన సంవత్సరం దయచేసిన దేవా
నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2)
ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2)
అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన ||
పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు
శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు
చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా
ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా
నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని