నీదు విశ్వాస్యత
Christian Song Lyrics
Teluguనీదు విశ్వాస్యత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించెను (2)
నిను ప్రేమించి నీ ఆజ్ఞలను
అనుసరించు మానుజావళికి (2)
నిబంధనను స్థిరముగ జేసి (2)
నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు||
వేయి తరముల వరకు సరిగా
విలసిల్లేటి వెలలేని మా (2)
వింతల కృపాంబుధి యగు దేవా (2)
యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు||