నన్నెంతగానో ప్రేమించెను
Christian Song Lyrics
Teluguనన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత||
సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)
పడనీయక దరి చేరనీయక (2)
తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత||
సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)
నేర్పించెను నాకు చూపించెను (2)
వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత||