నిబ్బరముతో నా యేసుకే
Christian Song Lyrics
Teluguనిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా
వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2)
యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా
యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా (2) ||నిబ్బరముతో||
కష్టకాలమందు నాకు – కనికరము చూపెను
కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను (2)
కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను
కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను
కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను ||యేసయ్యా||