నీవు లేని క్షణమైనా
Christian Song Lyrics
Teluguనీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని||
శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)