నా దేవ ప్రభువా
Christian Song Lyrics
Teluguనా దేవ ప్రభువా నీ చెంతను
సదా వసింపను నా కిష్టము
ఏవైనా శ్రమలు తటస్థమైనను
నీ చెంత నుందును నా ప్రభువా
ప్రయాణకుండను నడవిలో
నా త్రోవ జీకటి కమ్మినను
నిద్రించుచుండగా స్వప్నంబునందున
నీ చెంత నుందును నా ప్రభువా
యాకోబు రీతిగా ఆ మెట్లను
స్వర్గంబు జేరను జూడనిమ్ము