నావన్ని యంగీకరించుమీ
Christian Song Lyrics
Teluguనావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన (2)
భావంబునను నేను బహుదైర్యమొందెద ||నావన్ని||
నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద ||నావన్ని||
సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద ||నావన్ని||
నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)
ఆశచే నడిపించు మరల నా పదములు ||నావన్ని||