నా నాథుడా
Christian Song Lyrics
Teluguనా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)
పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా||
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)
యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా||
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)
ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా||
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)
కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా||