నిరంతరం నీతోనే
Christian Song Lyrics
Teluguనిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||