నన్ను దిద్దుము
Christian Song Lyrics
Teluguనన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||
దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను||
మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||