నీ స్నేహము
Christian Song Lyrics
Teluguనీ స్నేహము ఎంతో సత్యము
ఆద్యంతము నా హృదిలో పదిలము (2)
నా సఖుడా ప్రియ యేసయ్య
నా హితుడా స్నేహితుడా (2)
నీవెంత గొప్ప వాడివయ్యా
నను ఆదరించినావయ్యా (2)
సింహాల బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన నా విభుడవు
చెరసాలలోన సంకెళ్ళు విరచి
విడుదల నిచ్చిన రక్షక (2)