నీకు సాటి ఎవరు లేరు
Christian Song Lyrics
Teluguనీకు సాటి ఎవరు లేరు (యేసయ్యా)
ఇలలో నీవే ఏకైక దేవుడవు (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతును
నీదు క్రియలు కొనియాడెదను (2)
అత్యున్నతుడా నా యేసయ్యా
నీవే నాకు నిజ రక్షకుడవు (2) ||నీకు||
పరమందు దూతలు నిను పొగడుచుందురు
నీవే ప్రభువుల ప్రభువని (2)
నీ ఘన కీర్తిని వివరించగలనా
నా ప్రియుడా నా యేసయ్యా (2) ||అత్యున్నతుడా||