నీ ప్రియ ప్రభుని సేవకై
Christian Song Lyrics
Teluguనీ ప్రియ ప్రభుని సేవకై – అర్పించుకో నీవే
పవిత్ర ప్రజలైన మీరు – సేవించుడాయననే (2)
అంధకార జీవితమునకు – వెలుగు తెచ్చెను తానే (2)
ఆ వెలుగు ద్వారానే – నూతన మార్గము కలిగె (2)
సజీవ బలిగా నర్పించు – నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ||
తప్పిపోతివి గతమందు – తప్పు దారిని నడిచితివి (2)
తన ప్రేమా హస్తమే – నిన్ను కాపాడి తెచ్చెను (2)
యెంతైన స్మరియించు నీవు – వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ||